మహబూబ్ నగర్ /నేటి ధాత్రి
గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ (45) పీసీ నెంబర్ 3274 ఛాతీలో నొప్పి రావడంతో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే సహచర సిబ్బంది కానిస్టేబుల్ వెంకటేష్ ను మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించాడని వైద్యులు వెల్లడించారు. వెంకటేష్ స్వస్థలం చిన్నచింతకుంట. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.