ఒకటి కాదు రెండు కాదు.. బీచ్‌ వెంట పదుల సంఖ్యలో..

ఒకటి కాదు రెండు కాదు.. బీచ్‌ వెంట పదుల సంఖ్యలో..

 

దూరం నుంచి చూస్తే బోట్లన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి. ఆ ఊరంతా అలా తిరగబడిన బోట్లే కనిపిస్తాయి. ఈక్విహెన్‌ ప్లేజ్‌ గ్రామస్తులు వెరైటీగా పడవలను తిరగేసి ఇల్లుగా మార్చుకుంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటిని చూసినా తిరగబడిన పడవే పైకప్పుగా కనిపిస్తుంది.

 పడవ ఇల్లెక్కింది!

 

కారణమేమిటంటే…

దూరం నుంచి చూస్తే బోట్లన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి. ఆ ఊరంతా అలా తిరగబడిన బోట్లే కనిపిస్తాయి. ఈక్విహెన్‌ ప్లేజ్‌ గ్రామస్తులు వెరైటీగా పడవలను తిరగేసి ఇల్లుగా మార్చుకుంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటిని చూసినా తిరగబడిన పడవే పైకప్పుగా కనిపిస్తుంది. కాంక్రీటు స్లాబు గానీ, రేకుల నిర్మాణం గానీ కనిపించదు. ఇంటి గోడల నిర్మాణం పూర్తయ్యాక బోటును తిరగేసి గోడలపై పెడతారు. దాంతో ఇంటి నిర్మాణం పూర్తయినట్టే. సాధారణ ఇళ్లలో ఉన్నట్టే ఈ ఇళ్లలో సకల సదుపాయాలుంటాయి. ఈ గ్రామంలో ఆధునిక ఇంటి నిర్మాణాల కన్నా… పడవలతో ఏర్పాటు చేసుకున్న ఇళ్లే అధికంగా కనిపిస్తాయి. ‘సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించేందుకు ఈ నిర్మాణాలను కొనసాగిస్తున్నామ’ని అంటారు స్థానికులు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version