కేసముద్రం మండలంలో అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలలు
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి
మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి ధాత్రి :
కేసముద్రం మున్సిపల్ మండల లోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ నియవ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసముద్రం మండల విద్య శాఖ అధికారి కాలేరు యాదగిరి మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,
1) ఉప్పరపల్లి గ్రామంలో లాల్ బహదూర్ విద్యాలయం ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు,
2) కేసముద్రం స్టేషన్ లో సమత మోడ్రన్ హైస్కూల్ ఒకటి నుంచి పదవ తరగతి వరకు,
3) శ్రీ వివేకానంద విద్యాలయం ఒకటి నుండి పదవ తరగతి వరకు,
4) లేపాక్షి విద్యాలయం ఒకటి నుండి పదవ తరగతి వరకు హనుమతులు ఉన్నాయని,
5) అమీనాపురంలో కృషి విద్యానికేతన్ ఒకటి నుండి పదవ తరగతి వరకు,
6) లిటిల్ సిటిజెన్ పాఠశాల నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు ఉన్నాయని,
7) కేసముద్రం విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని విద్యాలయము నర్సరీ నుండి పదవ తరగతి వరకు మరియు
8) ధన్నసరిలో సెయింట్ జాన్స్ హై స్కూల్ నర్సరీ నుండి పదవ తరగతి వరకు అనుమతులు ఉన్నాయని, అలాగే
9) చెరువు ముందు తండాలో సాక్రెడ్ హార్ట్ స్కూల్ నర్సరీ నుండి పది తరగతి వరకు అనుమతి పొంది ఉన్నదని,
10) పెనుగొండ రామకృష్ణ విద్యాలయం నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు పొందినవని.
పైన తెలిపిన పది పాఠశాలలు ప్రభుత్వం ద్వారా అనుమతి కలిగి నడుస్తున్నవి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు:-
ఈ ప్రయివేట్ పాఠశాలల్లో అనుమతి లేని తరగతులను నిర్వహించకూడదని.
ఒక సెక్షన్ కు 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండకూడదని.
అనుమతి లేని పాఠశాల పేరు పెట్టుకొని నడిపించరాదని.
పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలుగాని నోటు పుస్తకాలు గానీ అమ్మ కూడదని.
పాఠశాల యొక్క పేరుతో వేరే ప్రాంతంలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మడం చేయరాదని.
తరగతి వారీగా ఫీజుల వివరాలను నోటీస్ బోర్డ్ పై అందరికీ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని.
తరగతి వారీగా విద్యార్థుల సంఖ్యను నోటీస్ బోర్డ్ పై అంటించాలని,
ఏదైనా పాఠశాలలో విద్యార్థులను తరలించడానికి వాహనాన్ని ఉపయోగించినట్లయితే, ఫిట్ నెస్ కలిగిన వాహనాన్ని, అర్హత కలిగిన, సుశిక్షితులైన డ్రైవర్ చేత
మాత్రమే వాహనాన్ని నడిపించాలని తెలియజేశారు.
పైన తెలిపిన సూచనలను అన్ని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం తప్పనిసరిగా పాటించవలెను. లేనిచో తగు చర్యలు తీసుకోబడతాయని మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి తెలిపారు.