*బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగిని పల్లి రవీందర్రావు
*ముదిగంటి సురేందర్ రెడ్డి
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావు పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన భిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ బారి మెజారిటీతో గెలవాలని గడప గడపకి ప్రచారంలో పాల్గొన్న భిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లీ రవీందర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు రవీందర్ రావు వివరించారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉంచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్ర పరిస్థితి ఆగం అవుతుందని అన్నారు. కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో మన సుంకే రవిశంకర్ ను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగంటి సురేందర్ రెడ్డి, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి ఉమా కొండయ్యా, డాక్టర్ అమిత్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లీ సుధాకర్, రైతు బంధు సమితి కొనుకటి లచ్చిరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుంటి శంకర్, సాంబ లక్ష్మి రాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.