గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలంలోని గోవిందుపల్లి గ్రామం లో యాదవ సంఘం సమావేశంలో సభ్యులందరి సమక్షంలో యాదవ సంఘం నూతన కమిటీ ని ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యాదవ్ సంఘము గ్రామ శాఖ అధ్యక్షులు నక్క లచ్చయ్య, ఉపాధ్యక్షులు కాల్వ మల్లేష్, ప్రధాన కార్యదర్శి కాల్వ చిన్న రాజయ్య, క్యాసియిర్ కాల్వ ఐలయ్య ను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ. సంఘము బలోపేతం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జక్కుల మల్లయ్య, పంబాల మహేందర్, చిన్న గంగన్న, గాంచుల మల్లయ్య కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.