మాదిగ హక్కుల దండోరా ( ఎం హెచ్ డి) హన్మకొండ జిల్లా నూతన కమిటీ నియామకం

హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొచ్చు రాజ్ కుమార్ మాదిగ
ఎన్జీవోస్ కాలనీ (నేటి ధాత్రి) :
ఈ రోజు హన్మకొండ జిల్లా కేంద్రం లో జరిగిన మాదిగ హక్కుల దండోర సమావేశం లో వడ్డేపల్లి ప్రాంతం లో మాదిగ హక్కుల దండోరా ( ఎం హెచ్ డి) హన్మకొండ జిల్లా కమిటీ నియామకం చేస్తూ మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గనిపాక ప్రదీప్ మాదిగ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన బొచ్చు రాజ్ కుమార్ ను హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు, ఈ సందర్భంగా ప్రదీప్ రాజ్ కుమార్ కు మరియు నూతన కమిటీ కీ శుభా కాంక్షలు తెలియజేస్తూ, హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు మరియు నియామకానికి సహకరించిన ప్రదీప్ కు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. . మాదిగ హక్కుల దండోరా హన్మకొండ జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొచ్చు రాజ్ కుమార్ , 58 డివిజన్ ప్రెసిడెంట్ ఓస్కుల అనిల్, హన్మకొండ మండల అధ్యక్షులు నల్ల విజయ్ పాల్ హన్మకొండ మండల కార్యదర్శి బొచ్చు హరీష్ , మండల ఉపాద్యక్షుడు బొచ్చు రాము, ఇళ్ళందుల నరేష్ – హన్మకొండ జిల్లా కార్యదర్శి, పసునూరి నవీన్ – 58 యువ సేన అధ్యక్షులు ,నల్ల స్పర్జన్ రాజ్ ,బొచ్చు సరోజన – 58 డివిజన్ మహిళా అధ్యక్షురాలు,పసునూరి పుష్ప – సెక్రెటరీ గా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో మాదిగ హక్కుల దండోరా హన్మకొండ జిల్లా కార్య కర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!