అధిష్టానానికి నా ధన్యవాదాలు-ముస్కె దేవేందర్
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండల బిజెపి అధ్యక్షుడిగా ముస్కె దేవేందర్ ని రావు పద్మ మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ముస్కె దేవేందర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో పరకాల మండలంలోని బిజెపి కార్యకర్తలను తీసుకొచ్చి మెజార్టీ సాధించేందుకు కృషి చేశానని అన్నారు.తనమీద నమ్మకంతో మండల అధ్యక్ష పదవి వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డికి,జిల్లా అధ్యక్షులు రావు పద్మకి,పరకాల ఎమ్మెల్యే కాంటెస్ట్ఎడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద రావు, బిజెపి కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, కాచం గురుప్ర సాద్ గుజ్జ సత్యనారాయణ రావు, దేవునూరి మేఘనాత్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్,రవీందర్ లకు తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన బిజెపి అధిష్ఠానికి కృతజ్ఞతలు తెలిపారు.