జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నరసింగాపూర్ గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ కుమార్ ను జైపూర్ మండలం సోషల్ మీడియా ఇన్చార్జిగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ చేతుల మీదుగా శుక్రవారం నాడు నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి సోషల్ మీడియాను ఒక బలమైన శక్తిగా తయారు చేస్తానని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు కోసం ఒక సైనికుల పనిచేస్తానని అన్నాడు.ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి రావడానికి సహకరించిన పెద్దపల్లి పార్లమెంట్ ఓఆర్డినేటర్ అరుణ్ వాల్మీకి జిల్లా కోఆర్డినేటర్ శశిధర్, చెన్నూర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సృజన్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.