ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుని నియామకం
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ చట్టబద్ధత కల్పించాలి
ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పందుల సారయ్య ను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షులు పులిగిల్ల బాలయ్య ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నత్తి కోర్నేల్ నియామకం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పందుల సారయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా ఆలు పెరగకుండా చేస్తున్నామని ఇట్టి ఉద్యమానికి ఎన్నో ఉడుదులుకులు జరిగిన ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు తీర్పుకు శిరసా వహిస్తూ అసెంబ్లీలో కమిటీని వేసి అదేవిధంగా షమీం అత్తరు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసి దానిపై సర్వే చేయించి వర్గీకరణ చేయించి మంత్రివర్గంతో ముసాయిదా తీర్మానం చేయించడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత కల్పించి అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని 19 96లో వర్గీకరణ చేస్తానని ప్రకటించిన బిజెపి నాలుగు పర్యాయాలు అధికారంలోకి వచ్చి వారు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అన్నారు. ఇలాంటి బీజేపీని ప్రజలు పాతాళని తొక్కే రోజు దగ్గరలో ఉందని బిజెపి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య అన్నారు.
నా నియమానికి సహకరించినటువంటి దళితరత్నం దొబ్బటి రమేష్ టి పి సి సి కార్యదర్శి పాముల రమేష్, డాక్టర్ శరత్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, దయాకర్, రావుల మురళి, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఘనపురపు అంజయ్య, మిట్ట కడుపుల జలంధర్, బ్లాక్ కాంగ్రెస్ బైరు వెంకన్న, పలువురికి అభినందనలు తెలిపారు.