జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు పాత శ్రీకాంత్ ని శనివారం రోజున ఆదివాసి యువజన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామని ఆదివాసి నాయకత్వం హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న తెలియజేశారు.ఈ సందర్భంగా గంజి రాజన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాత శ్రీకాంత్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియపరిచారు.76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నాయక పోడు జాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉందని,నాయకపోడు నివాసాలు ఉండే గ్రామాలలో తాగునీటి సమస్య,గ్రామాలకు రోడ్డు లేక విద్య వైద్యం ఉపాధి లేక నిరుపేదరికంలో జీవనం సాగిస్తూ బ్రతుకుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.తన జాతిని చైతన్యపరిచి ప్రభుత్వ పథకాలు అందే విధంగా విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు అందరికీ అందే విధంగా నిరంతరం గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసి వారు అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.మండలంలోని యువ కాంగ్రెస్ నాయకుడికి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో తన అభిమానులు కార్యకర్తలు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియపరిచారు.