చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చిల్పూర్ మండల అధ్యక్షునిగా బీసీ నాయకులు బత్తుల రాజన్ బాబు నియామకమయ్యారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ దూడల సిద్ధయ్య గౌడ్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గంటే ఉపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిల్పూర్ మండల నూతన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా బత్తుల రాజన్ బాబు మాట్లాడుతూ మండలంతోపాటు జిల్లాలో కూడా బీసీ కులాల అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని, నన్ను నియమించిన పదవీకాలం మూడు సంవత్సరాలు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు బనుక శివరాం యాదవ్,మారబోయిన ప్రకాష్ యాదవ్, బత్తిని అశోక్ గౌడ్ , అరవింద్ గౌడ్,ముక్కెర శ్రవణ్ యాదవ్,బత్తిని రాజు గౌడ్,పొన్నం కుమార్,పంతం రాజు గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.