
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అల్లకొండ కుమార్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*ఆదేశాల మేరకు జిల్లా యూత్ అధ్యక్షులు బండ శ్రీకాంత్* యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి *అల్లకొండకుమార్ ను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా ప్రకటించినారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్ మాట్లాడుతూ…..*
పార్టీ బలోపేతానికి యూత్ కాంగ్రెస్ ఎంతో ముఖ్యమని దానికి అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు అందించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషించి ఎమ్మెల్యే గెలుపునకు ఎంతో కృషి చేసినందుకు గాను రానున్న రోజుల్లో ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికలకు యువతను ముందు వరసలో ఉంచి పార్టీ అభ్యర్థులను గెలిపించుటలో ముందుండాలని మండల యూత్ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగిందని తెలియజేసి నారు.
అల్లకొండ కుమార్ మాట్లాడుతూ.
నాకు ఇచ్చిన ఈ పదవిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నాకు ఈ పదవి ఇప్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ కి రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డికి రాష్ట్ర జిల్లా మండల నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు* ఈ కార్యక్రమంలో…..
*చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, ఓబీసీ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, చిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, యూత్ నాయకులు గోల్కొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.