భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన 25 దరఖాస్తులను స్వీకరించి పరిష్కరానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం చాలా ముఖ్యమని, ప్రతి శాఖలో ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, సమస్యల పరిష్కారానికి సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం తర్వాత దరఖాస్తుదారునికి సమాచారం అందించాల్సిన
బాధ్యత ప్రతి అధికారిపై ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించిన వెంటనే ప్రజావాణి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డిఓ మంగిలాల్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు