
Government Degree College
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అస్లం ఫర్ కి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బాటనీ జువాలజీ, కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 24వ తేదీన సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.