జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట (కొత్తగూడెం) గ్రామంలో చెలుకల పోశం ఇంటి ఆవరణలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో నీరు నిలవడంతో దుర్వాసన వస్తూ దోమలు రావడంతో కాలనీవాసులు తెలియజేయడంతో యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్ అక్కడికి వెళ్లి పరిశీలించి పంచాయతీ కార్యదర్శి కి ఫోన్ చేసి వివరించడం జరిగింది. కార్యదర్శి మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తానని తెలియజేశాడు.