కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.శేఖర్ పాటిల్
◆ కేతకీ సంగమేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నూతన చైర్మన్ & పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రా౹౹ & మం౹౹ శ్రీ కేతకీ సంగమేశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం రోజున శ్రీ.సంగమేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికీ పాలభి శేకం నిర్వహించారు.ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్.అప్నగారి.

శేఖర్ పాటిల్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి .ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారు,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,జిల్లా యూత్ మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,బి.మల్లికార్జున్ మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆలయం ఈవో&అర్చకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.