
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
మోడీ విధానాలపై సమర శంఖం పూరించాలి.
జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
కేసముద్రం/ నేటి ధాత్రి
జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్, సిఐటియు, మండల కార్యదర్శి జల్లె జయరాజు, ఏఐసిటియు, జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి లు మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలని శుక్రవారం స్థానిక కేసముద్రం మార్కెట్ యార్డులో
ఐ ఎఫ్ టి యు కేసముద్రం పట్టణ అధ్యక్షులు మిట్టగడుపుల వెంకన్న అధ్యక్షతన కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.వక్తలు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు పని చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు.
కార్మికులకు కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ అనేకమంది కి విద్య, వైద్యం అందకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు.
మోడీ ప్రభుత్వం పేద ప్రజల కడుపులో కొట్టి కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకరణ కావాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని తోపాటు అన్ని రంగాలను నష్టపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
జూలై 9న స్థానిక జ్యోతిరావు పూలే సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక , రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొబ్బల యాకూబ్ రెడ్డి, నీరుటి జలంధర్, ఏ ఐ సి టి యు జిల్లా నాయకులు జాటోత్ బిచ్చ నాయక్, ఐఎఫ్టియు కేసముద్రం ఏరియా కమిటీ నాయకులు బండి రాజు, తదితరులు పాల్గొన్నారు.