మాదకద్రవ్యాల వినియోగంపై ప్రతిజ్ఞ – మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి
మొగులపల్లి నేటి ధాత్రి
ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు జడ్పీహెచ్ఎస్ మొగుళ్లపల్లి పాఠశాల ఆవరణలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించనైనది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో మాదకద్రవ్యాల వినియోగం ఒకటాని దాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అందులో విద్యార్థులను పాల్గొని మారకద్రవ్యాల వినియోగం అమ్మకం కొనడం నేరమని ఈ విద్యార్థులకు సూచించారు. మారకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అలా వినియోగించే వారిని అధికారులకు సమాచారం ఇచ్చి అరికట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి వెంకన్న వై సురేందర్ ఏ వి ఎల్ కళ్యాణి అనిల్ కుమార్ ప్రవీణ్ రాజు పద్మ లలిత విజయ భాస్కర్ రాజయ్య శ్రీకాళ అంగన్వాడీ టీచర్స్ చందర్ బజార్ వేణు ఎన్సిసి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
