Washington Sundar Injury Worries Team India
టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కనబర్చారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ప్రాక్టీస్ సెషన్లో గాయపడి ఈ సిరీస్ నుంచే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచులో కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. అతడి బదులు ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం క్రీజులోకి వచ్చిన వాషీ.. ఇబ్బంది పడుతూనే కనిపించాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో సుందర్ బరిలోకి దిగుతాడా? సిరీస్‌కే దూరమవుతాడా? అనే విషయంలో క్లారిటీ లేదు.
