కమలన్నీ వీడి కారెక్కిన కౌన్సిలర్ గడ్డమీది లావణ్య-శ్రీనివాస్
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్మెడ
వేములవాడ నేటి ధాత్రి
ఎన్నికలు సమీపిస్తున్న వేళా వేములవాడలో భారతీయ జనతా పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. మంగళవారం బీజేపీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరగా, బుధవారం వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన కోనాయపల్లి 13వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ గడ్డమీది లావణ్య-శ్రీనివాస్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. కోనాయపల్లిలోని కౌన్సిలర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుర్ముట్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, గజానంద రావు, ఆర్.సి రావు,రామతీర్థపు రాజు, రాజేశం, గోపు బాలరాజు, ఈర్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.