ఏసీబి వలలో మరొక అవినీతి తిమింగళం

జూనియర్​ అకౌంట్స్​ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్​ కార్యాలయంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.

నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్​ భరత్​కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్​ అకౌంట్స్​ అధికారి విజయ్​ సింహరెడ్డిని ఆర్టిజన్​ భరత్​ కొద్దిరోజులుగా వేడుకుంటున్నాడు.

లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేదన్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడుదల చేసేందుకు రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. దీంతో హైదరాబాద్​-2 ఏసీబీ యూనిట్​ అధికారులను ఆశ్రయించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!