నేటిధాత్రి, వరంగల్
వరంగల్ లోని, లాల్ బహుదూర్ కళాశాలలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని క్రికెట్ అంతర్ తరగతుల మధ్య క్రీడా పోటీలను ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ, డిహెచ్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరగతుల మధ్య క్రీడా పోటీలు విద్యార్థుల మధ్య నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడా పోటీలు విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో స్పోర్ట్స్ కోట ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ రిజర్వేషన్ను కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్ బి.ప్రభాకర్ మాట్లాడుతూ, కబడ్డీ, కోకో, చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్. బాస్కెట్బాల్ తదితర క్రీడలు బాలురు, బాలికలకు వేరువేరుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి, గేమ్స్ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు, బి శృతి, బి రజిని, జి సునీత, అధ్యాపకులు వి.మధుకర్ రావు, సిహెచ్ రవీందర్, సతిష్ ,రాణి, మమత. వివిధ క్రీడల కెప్టెన్సు పాల్గొన్నారు. ఈ క్రీడలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఫిజికల్ డైరెక్టర్ బి ప్రభాకర్ తెలిపారు.