సింగరేణి ఏరియా ఆసుపత్రి గణపతి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గణపతి దేవాలయ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఆసుపత్రి సిబ్బంది అధ్యర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, త్రయంబక హోమం, పూర్ణాహుతి హోమంలతో పాటు, లక్ష్మీగణపతి, ఆంజనేయ, సుబ్రమణ్యం స్వామి అభిషేకాలు, చేయడం జరిగిందని పూజారులు అంబా ప్రసాద్, చక్రవర్తి, సూరజ్, శ్రీకాంత్ లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మేకల రాజయ్య, బాబురావ్, ఆర్.శ్రీనివాస్, జమదగ్ని, రఘు, రమేష్, మహేష్, వైద్య సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.