
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ అంగన్వాడి సెంటర్ వన్ కేంద్రంలో వసంత పంచమి సందర్భంగా సిడిపిఓ అవంతి హాజరై ఇద్దరు గర్భవతులకు శ్రీమంతాలు ఒక బాబుకు అన్నప్రాసన ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసము చేయించనైనది, ఆమె మాట్లాడుతూ సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ స్వీట్స్ పంచనైనది, అలాగే రెండున్నర సంవత్సరాలు రాగానే అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం చేయించుకొని ఐదు సంవత్సరాల వరకు కేంద్రానికి పంపించినచో పిల్లల శారీరక మానసిక కండరాల అభివృద్ధి ఆలోచన శక్తి మేధాశక్తి పెంపొంది నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతారని ప్రైవేట్ స్కూల్ కి పంపించిన చొ ఆర్థికంగా తల్లిదండ్రులకు డబ్బులు నష్టం పిల్లల ఎదుగుదలకూడా ఆగిపోతుందిఅని ఎదిగే వయసు పిల్లలను చదువు పేరుతో ప్రైవేట్ స్కూల్లో బంధించడం పిల్లల స్వేచ్ఛకు భంగం కలిగించిన వారం అవుతాముఅని కేంద్రాలలో ఆటపాట కథ ద్వారా మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడము జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ త్రివేణి రమణమ్మ తల్లులు హాజరైనారు