
Annaprasadam by Shivaji Yuv Sena in Parakala
శివాజీ యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
అన్న ప్రసాద కార్యక్రమం అభినందనీయం సీఐ క్రాంతికుమార్,ఎస్ఐ విట్టల్
పరకాల నేటిధాత్రి
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాజీ యువసేన అధ్యక్షులు ఆర్పి జయంత్ లాల్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల సీఐ క్రాంతి కుమార్ మరియు ఎస్ ఐ విట్టల్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కుల మతాలకతీతంగా నిర్వహించే పండుగ శాంతియుతంగా నిర్వహించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో శివాజీ యువసేన గౌరవ అధ్యక్షులు ఆర్పీ జయంతి లాల్,కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు కిరణ్ కుమార్,శివాజీ యువసేన నాయకులు దినేష్,రాజేష్,నాగరాజ్ అర్జున్,వంశీ,లడ్డు,ఖాసీం,రాజకుమార్ ,శ్రీనివాస్,రాకేష్,పవన్,రవి,మహేందర్,సూర్య,ప్రవీణ్,రజినీకాంత్,అనిల్,నర్సింగరావు,మార్కండేయ,అశోక్,రవి,రాజు తదితరులు మరియు భక్తులు పాల్గొన్నారు.