పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా అన్నదానం

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన క్రి.శే.. పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యాం, సిరిసేడు తాజా మాజీ సర్పంచ్ రఫీఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి భార్య పరకాల రేణుక, కుమారుడు సాయికుమార్, సిరిసెడు మాజీ ఎంపిటిసి భీనవేనా సదయ్య, సిరిసేడు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు దేశిని మహేష్, జిల్లెల్ల దేవేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!