కనకదుర్గాదేవి మండపాలలో అన్న ప్రసాద కార్యక్రమాలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్, గద్దెరాగడి ఏరియాలలో ఘనంగా కనకదుర్గ దేవి మండపాలలో నిర్వాహకులు కుంకుమ పూజ అభిషేకము అన్న ప్రసాద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
శ్రీనివాస్ నగర్, తిలక్ నగర్, భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలలో అమ్మ వారి సన్నిధిలో మహా అన్న ప్రసాద కార్యక్రమాలు జరిగాయి. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.