
భద్రాచలం నేటి ధాత్రి
భారీగా తరలి వచ్చిన అంగన్వాడి కార్యకర్తలు
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొనసాగిస్తున్న ధర్నా
అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయాన్ని భద్రాచలం నియోజకవర్గం అంగన్వాడి టీచర్లు హెల్పర్లు సోమవారం నాడు ముట్టడించారు. ఉదయం 10 గంటలకే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు జిలకర పద్మ మాట్లాడుతూ అంగనవాడి కార్యకర్తలను బలవంతపు పదవి విరమణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు సగం జీతం పెన్షన్ రూపంలో అందించాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముందు నిరసన ధర్నా కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన శిబిరాల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని ఆరోపించారు. అంగనవాడిలతో పెట్టుకుంటే గత ప్రభుత్వాలకి పట్టిన గతే రేవంత్ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని హెచ్చరించారు. అంగనవాడి ల సమస్యలు పరిష్కరించే అంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంపీ నర్సారెడ్డి సీనియర్ నాయకులు గడ్డం స్వామి ఎర్రంశెట్టి వెంకట రామారావు బండారు శరత్ బాబు అప్పారి రాము చుక్కా మాధవరావు అంగన్వాడి కార్యకర్తలు నాగశీల సావిత్రి తదితరులు పాల్గొన్నారు