Anganwadi Teacher Commits Suicide
అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం సనుగుల గ్రామస్తురాలైన గొట్టే పరిమళ వయసు 36 సంవత్సరాలు, ప్రస్తుతం దేవుని తండా గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు మరియు భర్త ఆర్టీసీ హయర్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పరిమళ గత 8 నెలల నుండి గర్భసంచిలో గడ్డలు అయినవని పలు హాస్పిటల్లో తిరిగి ఎన్ని మందులు వాడినా కూడా కడుపునొప్పి తగ్గడం లేదని బాధపడుతుండేది. ఇట్టి విషయంలో మనస్థాపానికి గురై ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బెడ్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందుర్తి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.
