ప్రమోషన్ వయస్సు 50 పెంచాలి
కలెక్టరేట్ ముందు ధర్నా
కలెక్టర్, డి డబ్ల్యు ఓ లకు వినతి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
అంగన్వాడి హెల్పర్లకు ఎస్ఎస్సి అర్హతతో పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తూ 50 సంవత్సరాల వరకు పరిమితి ఉండే విధంగా చూడాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి కోరారు
సోమవారం తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా శిశు సంక్షేమ అధికారి లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది . ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి,కె విజయలక్ష్మి లు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యకాలంలో ఐసిడిఎస్ 9వేల అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిందని సంతోషం. కానీ ఇదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకి ప్రమోషన్ సౌకర్యం, విద్యార్హత SSC ఉన్న దానిని ఇంటర్ కి మార్చారు.దీనివల్ల అనేక సంవ్సరాల తరువాత వస్తున ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వచ్చే ప్రమోషన్ సౌకర్యనికి ఎక్కువమంది అంగన్వాడీ హెల్పర్స్ ప్రభుత్వం చేసిన నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరణ చెయ్యాలని,పాత పద్దతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సగం మంది అంగన్వాడి హెల్పర్లు గత 45 సంవత్సరాలు పైగా అంగన్వాడి కేంద్రాల్లో పనిచేస్తున్నారు. వీరికి గతంలో ఎస్ఎస్సి అర్హత ప్రకారం టీచర్ గా ప్రమోషన్స్ సౌకర్యం ఉండేది. గత ప్రభుత్వం 2022 డిసెంబర్ లో విద్యార్హతను ఇంటర్ గా మార్చింది. అంగన్వాడీ టీచర్ పోస్ట్ భర్తీ చేయాలంటే ఇంటర్ ఉండాల్సిందేనని ప్రభుత్వం అంటుంది. ఐసిడిఎస్ పట్ల ఎలాంటి అవగాహన లేని ప్రజల నుండి కొత్తగా వచ్చే వారికి సంవత్సరాలకు పైగా ఐసిడిఎస్ లో అంగన్వాడి కేంద్రాలను అంటిపెట్టుకొని పనిచేస్తూ టీచర్లు ప్రభుత్వం చెప్పిన అదనపు పనులు చేయడానికి బయటకు వెళ్లినప్పుడు ఆయా సమయాల్లో టీచర్ల పనులు కూడా హెల్పర్లు నిర్వహిస్తూ ఐసిడిఎస్ పైన అపార అనుభవం ఉన్న హెల్పర్లకు పాత కొత్త ఇద్దరికీ ఏ తేడా లేకుండా ఒకే రకమైన విద్యార్హత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం అత్యంత అన్యాయం. కొత్త, పాత తేడా లేనప్పుడు ఇది ప్రమోషన్స్ సౌకర్యం ఎలా అవుతుందో ప్రభుత్వం పరిశీలించాలి. ప్రమోషన్ అంటేనే కార్మికులు పనిచేసిన కాలాన్ని సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలి. దీనినే కోలబద్దగా చూడాలి. అంతేతప్ప కీలకమైన ఈ అంశాలను పక్కనపెట్టి విద్యార్థులను ముందుకు తేవడం అంటే అంగన్వాడి హెల్పర్లకు అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదనిఅన్నారు. ఇప్పటివరకు విద్యార్హత ఎస్ఎస్సి పెట్టి ఉన్నపలంగా రెగ్యులర్ ఇంటర్ ఉండాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు సేవలందించే హెల్పర్స్ రెగ్యులర్ ఇంటర్ ఎలా చేస్తారు ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైందిగా లేదు. ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక తదితర అనేక రాష్ట్రంలో ఎస్ఎస్సి అర్హత ప్రకారమే హెల్పర్స్కు ప్రమోషన్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగన్వాడీ హెల్పర్లకు న్యాయం చేయాలని, పాత పద్ధతి ఎస్ఎస్సి అర్హత ప్రకారమే ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ సానుకూలంగా ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని , లేనిచో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు దండెంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య , జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హేల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్గొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.సునంద, హెల్పర్స్ ఎం సుజాత ,భాను చంద్ర, అండాలు ,రేవతి, వెంకటమ్మ, యాదమ్మ, ఇందిరా, ఎల్లమ్మ, వజ్రమ్మ, లక్ష్మీ ,పద్మ, సుమలత, అనసూయ, సరిత, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.