·ఆంధ్ర రాజకీయాల పతన పథం
·కులపిచ్చిలో పీకల్లోతు మునిగిన వైనం

·పరస్పర కక్షలు తప్ప అభివద్ధి పట్టని పార్టీలు
·రెడ్‌బుక్, డిజిటల్ బుక్‌లు సరే అభివద్ధి బుక్ ఎక్కడ?
·ప్రస్తుత పరిణామాలు అధికారపార్టీకి సానుకూలతనివ్వవు
·తెలుగుదేశం స్వీయ విధ్వంస రాజకీయాలు
·వైసీపీ చేతికి బలమైన అస్త్రం
·రాష్ట్రాభివద్ధి మాటలకే పరిమితమా?
·ప్రచారం చాటంత…అభివద్ధి చిటికంత
ఒరులే యవి యొనరించిన
నరవర! యప్రియము తన మనంబునకగుదా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమథర్మపథములకెల్లన్!
ఇతరులకు ఏ పనిచేయడం వల్ల నీ మనసుకు బాధ కలుగుతుందో ఆ పనులను నువ్వు ఇతరులకు చేయకుండా వుండటమే అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం అని భావం. నన్నయ మహాభారతంలోని ఈ పద్యం చెబుతున్న నీతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ రాజకీయం విక టించి వ్యక్తిగత దూషణలు, ఇళ్లను తగలబెట్టడం, చివరకు రిమాండ్లకు తరలించడం వరకు చేరుకొని వర్తమాన నవ్యాంధ్ర యవనికపై తెలుగు ప్రజలకు “రాజకీయ కక్ష కథాచిత్రమ”ను కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఒకవైపు అభివద్ధి లేక, అప్పుల ఊబిలోకూరుకుపోయిన రాష్ట్రం, మరోవైపు గతుకుల రోడ్డుపై పయనిస్తున్న బతుకుబండి సామాన్యుల నడ్డిని విరిచేస్తున్న దుర్భర స్థితిలో, ప్రస్తుత పరిణామాలు నిశ్ఛేష్టులను చేస్తున్నాయి.
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ`సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్ షీటు దాఖలు చేసిన తర్వాత ఆ సంగతిని అంతటితో వదిలేయక, బురదచల్లుడు రాజకీయంతో మొత్తం పరిస్థితిని అరాచక స్థితికి తీసుకెళ్లిన ఘనత, తెలుగుదేశం, వైఎస్సార్సీపీలకు దక్కుతుం ది. లంకాదహనం నాటకంలో హనుమంతుడి తోÅ£కు నిప్పుపెట్టే సీన్లో ఆ పాత్ర ధరించిన నటుడు నిప్పంటించిన తోకతో స్టేజీపై గంతులు వేస్తున్నప్పుడు తెరకు నిప్పంటుకొని వూరుకు చుట్టుకున్న రీతిన ఇప్పుడు విద్వేష రాజకీయం ఆంధ్రను కుదిపేస్తున్నది. తెలుగువారి ఇలవేల్పు శ్రీ వేంకటేశ్వరస్వామిపై కూడా రాజకీయాలు చేసే దౌర్భాగ్యస్థితి నేడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నందుకు ఆయన భక్తులు తలదించుకోవాల్సి వస్తున్నది. నెల్లూరు ఏసీబీ కోర్డులో చార్జ్‌షీట్ దాఖలైన తర్వాత, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ లడ్డూ కల్తీ పాపం వైసీపీదేనంటూ ఫ్లెక్సీలు వెలవడం ఇప్పుడు విధ్వంస రచనకు ప్రధాన కారణం. ఇది వైసీపీ నాయకులకు ఆగ్రహం కలిగించడం సహజం. ఈ ఫ్లెక్సీ వివాదమే వైసీపీ నేత రాంబాబు ఆగ్రహానికి కారణమని, సజ్జల రామకష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో చెప్పారు. అంతేకాదు, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి వారు వై.ఎస్. జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆధారాలు తమవద్ద వున్నాయని కూడా ఆ యన స్పష్టం చేయడం గమనార్హం. ఇదిలావుండగా తన తెలుగుదేశం కార్యకర్తలపట్ల తన వ్యాఖ్యల పట్ల ఆయన చింతిస్తున్నట్టు చెప్పడం తర్వాత పరిణామం. ఇప్పుడు ఆయనపై కేసులు న మోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం, ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్డు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం, రాజమహేంద్రవరం జైలుకు తరలించడం తర్వాత వేగంగా జరిగిన పరి ణామాలు. ఇంతలోనే మాజీ మంత్రి జోగి రమేష్, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్‌పై నోరుపారేసుకున్నారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిని త గులబెట్టడం మరో పరిణామం. ఇప్పుడు ఈ తిట్ల సంస్కతికి మాజీ మంత్రులైన అంబటి రాంబా బు, జోగి రమేష్‌ల ఇళ్లు అగ్నికి ఆహుతి కావడం తాజా పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాజకీయా లువ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు కుýపిచ్చికి మారుపేరని పేరు. ఇదిప్పుడు పరాకాష్టకు చేరి, ప్రజల్లో ఒకరకమైన జగుప్స ఏర్పడుతున్నది.
అసలే రాష్ట్రం విడిపోయి, అభివద్ధి లేక నానా అగచాట్లు పడుతున్న నేపథ్యంలో అభివద్ధిపై సొంత బాకాలు వూదుకోవడం తప్ప అధికారంలోకి వచ్చిన పార్టీలు వెలగబెట్టిందేమీ వుండటంలేదు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కావలసింది కులంతోపాటు, కక్షపూరిత రాజకీయాలు నెరపే నేతలు కాదు. నిష్పక్షపాతంగా రాష్ట్రాభివద్ధికి పాటుపడే నాయకుడు అత్యంత అవసరం. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం రెండు కులాలు మాత్రమే కాదు. ఈ రెండు కులాల ఓట్లతోనే ఎవరూ అధికారంలోకిరావడంలేదన్న సత్యం గుర్తుంచుకోవాలి! ఆంధ్ర రాజకీయాలు సైద్ధాంతిక విభేదాలు, విమర్శల స్థాయిని ఎప్పుడో దాటిపోయి, కులాలు, వ్యక్తిగత కక్షల స్థాయికి పతనమయ్యాయి. ఇదిప్పుడు పరాకాష్టకు చేరిందంతే! రాజకీయంగా లబ్ది కలుగుతుందంటే, దేవుణ్ణి కూడా నడిబజారులో నిస్సిగ్గుగా నిలబెట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దిగజారాయి. మళ్లీ దేవుడిపై అపచారమం మంటూ వీళ్లే సుద్దులు చెబుతుండటమంత దారుణం మరోటిలేదు.
విచిత్రమేమంటే అధికారంలో లేనప్పుడు, దానికోసం విపరీతమైన వెంపర్లాట, అదిలేకపోతే ప్రాణమే పోతుందన్నత ఆక్రోశం, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవడానికి, ప్రత్య ర్థులను అణగదొక్కడానికి చేసే రాజకీయంతోనే ఉన్న కాలమంతా గడిచిపోయి రాష్ట్రాభివద్ధిని పట్టించుకునే తీరికే పార్టీలకు వుండటంలేదు. రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే ప్రధానంగా పోటీలో వుండటం రాష్ట్ర ప్రజలకు మరో దురదష్టం. మిగిలిన పార్టీలు సోదిలో లేకపోవడంతో వీరికి మరో ప్రత్యామ్నాయం వుండటంలేదు. దీనికి తోడు అధికారం ఎప్పటికప్పుడు మారుతుండటం తో కక్షపూరిత రాజకీయాలతో ఒకరు చేసిన దాన్ని మరొకరు నిలుపు చేయడం వంటి కార్యక్ర మాల వల్ల రాష్ట్రాభివద్ధి జరగడంలేదు. ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటైన పుష్కర కాలంలోనే గణనీయ ప్రగతిని నమోదు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం దాటినా రాజధానిపై ఇప్పటివరకు ఒక స్పష్టతలేదు. ప్రచారం కొండత, జరిగేది చిటికంతఅన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి.
వైసీపీ అధికారంలో వుండగా తెలుగుదేశం, అధికార పార్టీ అక్రమాల పేరుతో రెడ్‌బుక్‌ను తీసు కొస్తే, ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్‌ను తీసుకొస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడ ల్లా వీరి బలయ్యేది ప్రధానంగా పోలీసులు, అధికార్లు! ఎవరి కులాలవారిని లేదా అనుకూలురనుపైకి తీసుకు రావడం, పాలన సాగించడం జరుగుతోంది. అభివద్ధికి పార్టీలకతీతంగా మేధావు లు, విధాన కర్తలతో ఒక ప్రణాళిక రూపొందించి, ఈ క్రమం దారితప్పకుండా అధికారంలోకి వచ్చిన పార్టీలు జాగ్రత్త వహించాలి. దీన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ, ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు. కానీ అవి వ్యక్తిగత కక్షలుగా మారకూడదు! వ్యక్తిగత దూషణల స్థాయికి రాజకీయాలు దిగజారితే అది చాలా ప్రమాదం! సయోధ్యకు వీల్లేని స్థాయిలో కుల రాజకీయాలు పేట్రేగి రాష్ట్రాభివద్ధికి పెద్ద గొడ్డలిపెట్టుగా మారతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదిదే!
గుర్తుతెలియని వ్యక్తులు లడ్డూ వివాదంపై వైసీపీని టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు తక్షణం వాటిని తొలగించినట్లయితే సమస్య ఇంతవరకు వచ్చేదికాదు. పోలీసులు స్పందించలేదంటే అందుకు ప్రభుత్వ మద్దతు వున్నదనేగా అర్థం! ఇప్పుడు జరుగుతున్న విధ్వంస రాజకీయంలో నష్టం ఎవరికి? లాభం ఎవరికి? లాభం మాట అట్లావుంచి నష్టం మాత్రం దారుణంగా వుంటుంది. ఏకమొత్తంగా రాష్ట్ర ప్రజలు ఇటువంటి పనికిమాలిన రాజకీయాల మధ్య చిక్కుకొని నష్టపోతారు. అభివద్ధి కోసం గొడవ పడటంలో అర్థముంది. రాష్ట్రాభివద్ధికి ఎంతమాత్రం దోహదం చేయని ఎటువంటి రాజకీయమైనా అది హర్షణీయం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కావలసింది మంచి పాలకుడు తప్ప కుల రాజకీయాలతో ప్రత్యర్థులను ఎప్పటికప్పుడు తొక్కేసే ప్రక్రియలో మునిగి వుండే నాయకులు కాదు! సమర్థులైన పాలనాదక్షులున్న రాష్ట్రాలు ఎప్పుడూ అభివద్ధి పథంలో ముందుకెళతాయి. కేంద్రంలో నరేంద్రమోదీ నేతత్వంలో ప్రభుత్వ పనితీరే ఇందుకు నిదర్శనం. గత పదేళ్ల కాలంలో సాధించిన విజయాలు, అభివద్ధి,అంతర్జాతీయ ప్రతిష్టను పరిశీలిస్తే, పాలకుడనేవారు ఏవిధంగా వుండాలన్నది సుస్పష్టమవుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా అభివద్ధి చేసిన విధం, ఇప్పుడు దేశమంతా గుజరాత్ నమూనా అనుకునే విధంగా ప్రాచుర్యం పొందింది. అటువంటి నాయకత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చాలా అవసరం.
విపరీత ప్రచారం ద్వారా ఎప్పుడూ ప్రజల్లో వుండాలనుకోవడం కాదు, తాను చేసిన సమర్థవంతమైన పనులే ప్రజల నాలుకపై తన పేరును నడయాడేలా చేస్తుందన్న సత్యాన్ని నాయకులు గు ర్తుంచుకోవాలి. అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ వంటి రాజకీయాలు కనిపించవు. వారివారి పంథాలో అభివద్ధి కొనసాగుతుంటుంది. అక్కడా రాజకీయాలు లేదా లోపాలు లేవని కాదు. పరిశీలిస్తే ఎవరి అభివద్ధి పథం వారిదిగా కనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ మాటేంటి? ఇంతవరకు రాజధాని నిర్ణయం కాలేదు. పుష్కర కాలానికిఅమరావతి నిర్ణయమైనా సాధారణ అభివద్ధికే మరో పుష్కరకాలం పడుతుంది. ఈలోగా ప్రస్తుతఅధికారంలో వున్న ప్రభుత్వం మారిపోతే, వచ్చే కొత్త ప్రభుత్వం ఇదే పద్ధతిని కొనసాగిస్తుందన్న గ్యారంటీ లేదు. అంటే అభివద్ధికి ఒక నిర్దిష్ట విధానం లేకపోవడం ఇక్కడ పెద్దలోపం. అందువల్ల తెలుగుదేశం, వైసీపీలు అభివద్ధి విషయంలో ఏకాభిప్రాయంతో వుండటం అత్యంత అవస రం. అప్పుడే వద్ధి కొనసాగుతుంది. ఇందుకు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ కూడా కుల రాజకీయాలు, ద్రవిడ భావజాలం బలంగా వున్నప్పటికీ అభివద్ధి విషయంలో అం తా ఒక్కటవుతారు. ఆ పరిస్థితి ఆంధ్రలో కూడా రావాలి.
వర్తమాన పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతమాత్రం మంచివి కాదు. జాతీయ సమాజంలో చులకన కావడం తప్ప మరోటుండదు. లడ్డూ వివాదాన్ని రాజకీయం చేసి ఫ్లెక్సీలు వేయడం, పరస్పర దూషణలు, చివరకు ఇళ్లు తగలబెట్టుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చడం దురదష్టం. ఈ పరిణామాలు కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా మారడం ఖాయం. తెలు గు దేశం స్వీయ హనన రాజకీయాలు చేస్తున్నదనుకోవాలి. ప్రచారంతో పదవుల్లో కొనసాగే కా లం మారి పోయింది. పనిచేస్తేనే విలువ! క్రమంగా ఉచితాల పట్ల కూడా ప్రజల్లో ఒకరకమైన వ్యతిరే కత వ్యక్తమవుతుండటం తాజా పరిణామం! ఎందుకంటే అధికారంలోకి రావడానికి అలవికాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు. వాస్తవిక దక్పథం లేక, కేవలం అధికారమే పరమావధిగా కొనసాగే పార్టీలకు ఇది వర్తిస్తుంది. అధికారంలో వున్న వారు సంయమనంతో వ్యవహరించాలి. వైసీపీ నేతలు దుర్భాషాలడటం తప్పే! ఇందులో ఎటువంటి సందేహం లేదు! కానీ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా దూషించిన తెలుగుదేశం నాయకుల మాటేంటి? ఇదే స్ప ష్టంగా సజ్జల రామకష్ణారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ప్రస్తుత పరిణామాలకు ఫలితం తప్పక వుంటుందని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే రేపు వైసీపీ అధికారంలోకి వస్తే, ప్రస్తుత ఎపిసోడ్‌కు కొనసాగింపే వుంటుందనేది సుస్పష్టం. మరి దీనికి అంతమెక్కడ? అభివద్ధికి తావెక్కడ? రోడ్లు బాగుంటే అభివద్ధి చెందినట్టేనన్న భావంనుంచి ఆంధ్రప్రజలు కూడా బయటకు రావాలి! అభివద్ధిలో రోడ్లు మంచిగా వుండటం ఒక భాగం! మిగిలిన రంగాల అభివద్ధికి రవాణా సదుపాయం అత్యవసరం! ఇందులో సందేహం లేదు! ప్రజలు ప్రచారాల ీVAరులో కొట్టుకుపోకుండా, అభివద్ధిపై ప్రభుత్వాలను నిలదీసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రస్తుత పరిణామాల్లో వ్యక్తిగత కక్షలు తప్ప, అభివద్ధి పట్ల ఆసక్తిని రాజకీయ పార్టీలు ప్రదర్శించకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రధాన లోపం! దీన్ని తమ ఓట్ల రూపంలో సరిచేయాల్సింది ప్రజలే!
