
`ఇప్పటికీ తెలంగాణ మీద విషం కక్కుతూనే వుంటారు!
`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తారు!
`కేసీఆర్ అసెంబ్లీకి హజరు కాకపోవడం కూడా వాళ్లకు ఇబ్బందే!
`అవకాశం దొరికింది కదా అని విమర్శలే!
`ఎన్టీ రామారావు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా హజరుకాలేదు.
`నన్నపనేని రాజకుమారి ఏదో ఒక మాట అన్నదని రానని వెళ్లిపోయారు.
`మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా! అని రాలేదు.
`ఆంధ్రా మేధావులకు అది గుర్తు చేయరు!
`ఆనాడు ఎన్టీఆర్ చేసింది కూడా తప్పే అనే ధైర్యం వారికి వుండదు.
`వైఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి హజరుకాలేదు.
`తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర, పాదయాత్రల పేరుతో హజరుకాలేదు.
`ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించరు!
`వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా హజరుకాలేదు.
`ఎమ్మెల్సీగా వుండి పాదయాత్ర చేసిన లోకేష్ మండలికి హజరుకాలేదు.
`అప్పుడు ఏ ఒక్క ఆంద్రా మేధావి నోరుతెరవలేదు!
`తెలంగాణ మీద మాత్రం నోరుతెరుస్తారు.
`సుద్దపూసల సుద్దులన్నీ చెబుతుంటారు!
`కాళేశ్వరం కడితే ప్రజాధనం వృధా అంటారు.
`పోలవరం పూర్తి కావాలని కోరుకుంటారు.
`తెలంగాణ అభివృద్ధిని చూసి ఏడిచి చస్తుంటారు?
హైదరాబాద్, నేటిధాత్రి:
మేధావి మౌనం దేశానికి ప్రమాదకరమని మాజీ ప్రదాని పివి. నర్సింహారావు అన్నారు. కాని మేధావులు అంటే ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేధావులు వేరు. అప్పటి మేదావులు వేరు. ఇప్పటి మేధావులు వేరు. అప్పటి మేధావులు సమాజం గురించి మాత్రమే ఆలోచించేవారు. రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. కాని నేడు మేధావులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన రాజకీయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పైగా మేధావి అంటే అన్ని రంగాల, రకాల విషయాల మీద అవగాహన వుండాలని ఏమీ లేదు. సమాజంలో అనేక రంగాలున్నాయి. ఆయా రంగాలలో వుండే మేదావులు వేరు. ఒక రంగంలో మేదావి మరో రంగం గురించి మాట్లాడే వారు కాదు. కాని ఇప్పుడు మేధావి అంటే చాలు అన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. గతంలో మేదావులు అనేక రకాల పుస్తకాలు అధ్యయనం చేసేవారు. ఆయా రంగాలపై ఇతరుల మీద ఆదారపడాల్సినంత అవసరం లేని మేధస్సును వారి కలిగి వుండేవారు. ఇప్పుడు అంతా గూగుల్ మేధావులు. వారికి అవసరమైన విషయాలను అప్పటిప్పుడు గూగుల్‌లో చూసి తెలుసుకొని గొప్పలకు పోతున్నారు. మేదావులుగా చెలామణి అవుతున్నారు. వారికి తెలిసింది గోరంత. కాని చెప్పేది కొండంత. అందులో అంతా డొల్ల. పైగా తమకు మించిన విశ్లేషకులు లేరన్నట్లు మాట్లాడుతూ వున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖంగా టెలివిజన్ తెరలమీద, యూట్యూబ్‌లలో మాట్లాడే మేదావులు ఎక్కువయ్యారు. అలాంటి వారిలో మాజీ ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మినారాయణ ఒకరు. నిజానికి ఆయన ఒక మేదావిగానే చెలామణి అయితే ఆయనను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కాని ఆయన రాజకీయ అవతారమెత్తిన మేదావి వర్గం. ఆయన తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల మీద బాగానే మాట్లాడుతున్నారు. ఇంత వరకు సంతోషమే. కాని తెలంగాణ రాజకీయాలపై మాత్రం అప్పుడప్పుడూ విషం కక్కుతూనే వుంటారు. కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హజరు కాకపోవడం ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కాని వాటిలో కూడా ఆయన దూరి మాట్లాడిప్పుడు అన్ని విషయాలను ప్రస్తావించాలి. అంతకు ముందు రోజుల్లో అసెంబ్లీకి హజరు కాని వాళ్లు ఎంత మంది వున్నారు. వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ఇది తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం పోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎన్టీఆర్‌ను రాజకీయంగా అప్పటి ప్రభుత్వ చీఫ్ విఫ్ నన్నపననేని రాజకుమారి ఏదో అన్నారు. దానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనే మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అంటూ వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. మరి ఆనాడు ఆయన చేసింది మాత్రం ఏపి మేదావులకు ఒప్పుగానే కనిపించిందా? ఆ విషయాన్ని ఏపి మేధావులు ఎందుకు ప్రశ్నించరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆయన ఒకసారి బస్సుయాత్రచేశారు. రెండోసారి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ సమయంలో చంద్రబాబు జీతం తీసుకున్నారు. ఆ విషయం మాత్రం ఏపి మేధావులు గర్తు చేయరు. 2004కు ముందు దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాలేదు. నేరుగా ఎన్నికలకు వెళ్లారు. పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ మేదావులకు ఆయన కనిపించలేదు. 2014 తర్వాత ఏపిలో ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగానే మళ్లీ ఏపి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి హజరు కావడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా వున్న ప్రస్తుత మంత్రి లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మండలి సమావేశాలకు హజరు కాలేదు. ఆ విషయం కూడా ప్రస్తావించేందుకు ఏపి మేధావులకు నోరు రాదు. కాని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్ మాత్రం అసెంబ్లీకి హజరు కాకపోవడాన్ని మాత్రం తప్పు పడుతుంటారు. ఇక మరో మేధావి జయ ప్రకాశ్ నారాయణ్. ఆయన ఓ మాజీ ఐఎఎస్ అదికారి. కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే. లోక్‌సత్తా అనే పార్టీకి అదినేత. ఆయన మేధావి తనం మరీ విచిత్రం. నీతి వంతమైన రాజకీయాల గురించి మాత్రం గొప్పలు అనేకం చెబుతాడు. కాని ఆయన లేని లోక్‌సత్తాను ఇతరుల చేతుల్లో పెట్టలేదు. ఏకంగా పార్టీనే రద్దు చేశారు. అంటే అప్పటి వరకు పార్టీకి సేవలందించి వారి రాజకీయ జీవితాలు ఆగం చేశారు. లోక్‌సత్తాకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయి? ఆ విరాళాలు ఏదైనా స్వచ్చంధ సంస్ధకు అందించారా? ఏం చేశారు? ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయి? అని మాత్రం ఆయనను అడగకూడదు. దేశ ఆర్దిక పరిస్దితులు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నట్లు మాట్లాడుతుంటారు. ఏపికి మేలు చేసే వ్యాఖ్యలను చేస్తుంటారు. ఏపి మీద మమకారం. తెలంగాణ మీద పైకి కనిపించని కోపం ప్రదర్శిస్తుంటారు. ఎంతో తెలివిగా ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఓ వైపు లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయం చేసేవారు. పైకి మాత్రం తెలంగాణ వస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అనేవారు. కలిసి వుంటేనే కలదు సుఖం అని నీతులు చెప్పేవారు. తెలంగాణ రావడం అలాంటి మేధావులకు సుతారం ఇష్టం లేని పని. అందుకే తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. లక్ష కోట్లు వృధా చేశారని అనేక సార్లు చెబతూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపి బనకచర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఏపికి ఆర్ధిక బారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. కాని పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఎఎస్‌లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్ అయ్యారు. తెలంగాణలో వుంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే వుంటారు. తెలంగాణ తెర్లు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ది చెందడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఆర్దిక సి ్దతి ఏమిటి అనేది జేపికి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది? ఎందుకు అయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? అందుకు కేసిఆర్ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రమౌతుందని ఆశపడ్డారు. కాని తెలంగాణ దేశంలనే శీఘ్రంగా ప్రగతి దారిలో పరుగెత్తుతోంది. కాళేశ్వరమంటే కేవలం మూడు బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో వున్న కొందరు ఏపి మేధావులు తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటారు.