Poet Andesri’s Demise — Irreparable Loss to Literature
కవి లోకానికి తీరని లోటు అందెశ్రీ మరణం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణం కవి లోకానికి తీరని లోటని, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదిరిస్తూ పెద్దగా డిగ్రీలు పొందకుండా ఆశ కవిగా గేయ రచయితగా ఎదిగిన గొప్ప కవి అందెశ్రీ,, జయ జయహే తెలంగాణ జననీ జయ కేతన మనే పాట తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినింపిన ప్రముఖ గేయంగా మారింది. ఇది వారి కలము నుంచి జాలు వారినది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్న పాట కూడా ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది.ఇలాంటి అనేక గేయాల రచయితగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టర్ పొందిన మహాకవి వారి అకాల మరణానికి వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తూ సంతాపాన్ని తెలుపుతున్నాం ఘన నివాళులు అర్పి స్తున్నాం. అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహాధ్యక్షులు కోడం నారాయణ, నే రోజు రమేష్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, వంశీకృష్ణ, అంకారపు రవి, ఎం.డీ హఫీజ్ మొదలైన కవులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
