Chennai Suburbs Still Flooded After Ditva Cyclone
ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు
చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
‘దిత్వా’ తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నైతో పాటు శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కుమరన్ నగర్లో 15 గృహాల్లోకి వర్షపునీరు చేరింది. నగరంలోని 22 సబ్వేల్లో నీరు నిల్వ లేకుండా జీసీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. వాయుగుండం బలహీనపడినప్పటికీ ఏడు జిల్లాలకు మాత్రం వర్ష సూచన ఉందని వాతావారణశాఖ హెచ్చరించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. కాగా గురువారం చెన్నై , తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.రాజధాని వాసులు మూడు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. దిత్వా తుఫాన్ కారణంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థల కు సెలవు ప్రకటించారు. రహదారుల్లో వాహనాల రద్దీ తక్కువగా కనిపించింది. ఒక వైపు వర్షం, మరోవైపు చలి పెరడగంతో నగర వాసులు ఇంటికే పరిమితమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే జాలర్లు కూడా గత 8 రోజులుగా చేపల వేటకు దూరంగా ఉన్నారు.
చెన్నై నగరంలో మొత్తం 22 సబ్వే (అండర్పాస్)లున్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ సబ్ వేలలోకి వర్షపునీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే, ఈ సారి ఆ పరిస్థితి రాకుం డా, కార్పొరేషన్, అగ్నిమాపకదళం, ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఒక్క సబ్వేలో కూడా నీరు చేరకుండా మోటర్లతో నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్ చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలగలదేఉ.
