ఒక వర్గం ఓట్ల కోసమే ఆనంద్ కుమార్ డ్రామాలు.
బిజెపి
కల్వకుర్తి/నేటి దాత్రి:
కల్వకుర్తి పట్టణంలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంద్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మరియు హిందువుల పై అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని, కేవలం ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం హిందువుల పైన విషం కక్కడం దారుణమని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మొగిలి దుర్గాప్రసాద్ అన్నారు. పహాల్గం దాడి ఘటనలో వీరమరణం పొందిన కుటుంబ సభ్యులు తమ వారిని తీవ్రవాదులు హిందువులుగా నిరూపించుకున్న తర్వాతే చంపడం జరిగిందని పక్కన ఉన్న వారి భార్య పిల్లలు వాపోయిన విషయాన్ని ఆనంద్ కుమార్ వక్రీకరించడం వెనుక ఒక వర్గం ఓట్ల కోసమే అన్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి పబ్బం గడుపుకోవడం ఆనంద్ కుమార్ కు అలవాటే అన్నారు.వక్ఫ్ బోర్డ్ సమస్యను పక్కదోవ పట్టించడానికి భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగానే పహల్గావ్ సమస్యను తెరపైకి తెచ్చింది అనడం అవివేకమన్నారు. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ 100 కోట్ల హిందువులను చంపుతాం అన్నప్పుడు అప్పుడు హిందువులకు మద్దతుగా ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు
ఒక వర్గం మెప్పుకోసం కుర్చీ కోసం పనిచేసే ఆనంద్ కుమార్ ను వచ్చే స్థానిక సంస్థఎన్నికలలో బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు బోడ నర్సింహ,బిజెపి పట్టణ అధ్యక్షులు బాబీ దేవ్,మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్,తదతరులు పాల్గొన్నారు.