మహబూబ్ నగర్/నేటి ధాత్రి
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాద్ నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వివరాలు ప్రకారం.. మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (36) మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియచేస్తే..94414 07039, 98480 90426 తెలియజేయాలన్నారు.