Ex-Lover Attacked at Ex’s Wedding Over Kiss Incident
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..
మాజీ ప్రియుడి పెళ్లిలో యువతికి దారుణమైన అవమానం జరిగింది. పెళ్లి కొడుకు చెయ్యిని ముద్దు పెట్టుకోవటంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. వాయు వేగంతో స్పందించింది. భర్త మాజీ ప్రియురాలిపై దాడి చేసింది.
మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లిన ఓ యువతికి దారుణమైన అవమానం జరిగింది. పెళ్లి కొడుకు చెయ్యిని ముద్దు పెట్టుకోవటంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. వాయు వేగంతో స్పందించింది. భర్త మాజీ ప్రియురాలిపై దాడి చేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ప్యాంట్స్, షర్ట్ వేసుకున్న ఓ అమ్మాయి మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
