చేర్యాల నేటిధాత్రి..
చేర్యాల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించిన జిల్లా నాయకురాలులు దాసరి కళావతి, ఐనాపూర్,లెనిన్ నగర్ సర్పంచ్ లు రమణారెడ్డి, సనాది సబిత భాస్కర్ లను సిపిఎం ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రకటించారు. చేర్యాల సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు, నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ, బూర్జువా పార్టీలతో జతకట్టి, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసిన, పార్టీకి నష్టం చేయాలని చూసిన వీరిని సిపిఎం నుండి బహిష్కరిస్తున్నామన్నారు. ఈరోజు నుండి వారికి సిపిఎం కు ప్రజా సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వీరి పట్ల పార్టీ సభ్యులు ప్రజాసంఘాల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వీరికి బుద్ధి చెప్పాలని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో, మద్ధూర్ మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు దాసరి ప్రశాంత్, చోప్పరి రవికుమార్, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, అత్తిని శారద, నాయకులు తేలు ఇస్తారి, ఉల్లంపల్లి సాయిలు, నరసవ్వ, దాసరి బాలస్వామి, తాడూరు మల్లేశం, ఇప్పకాయల శోభ, పోలోజు శ్రీహరి, ఆముదాల నర్సిరెడ్డి రాళ్ళబండి భాస్కర్, చెక్క యాదగిరి, బోయినీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.