మండలం లొనే అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా ముఠా.!?

ఉమ్మడి మండలంలో అంతర్ రాష్ట్ర మద్యం పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.!?

పెద్ద మొత్తంలో అంతర్రాష్ట్ర మద్యం బెల్ట్ నిర్వాహకులను గుర్తింపు.!?

మాఫియాను రక్షించే క్రమంలో రంగంలోకి రాజకీయ నాయకులు.?

అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా పై ఎక్సైజ్ కమిషనర్ ఇలాంటి చర్యలు తీసుకుంటారు చూడాల్సిందే..!

మహాదేవపూర్ -నేటి ధాత్రి;

గత పది రోజుల క్రితం మహదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ కు సంబంధించిన పలు రకాల మధ్యాన్ని విక్రయిస్తుందా క్రమంలో ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం విధితమే, అంతర్ రాష్ట్రం నుండి మద్యం మండలంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కేవలం అంతర్రాష్ట్ర మధ్య విగ్రహాల కొరకు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో అంతరాష్ట్ర మద్యాన్ని విక్రయాలు జరపడం మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది అంతేకాకుండా స్థానికంగా ఉన్న మద్యం దుకాణాలకు పెద్ద మొత్తంలో గండి కూడా పడిందని అంటున్నారు. అంతరాష్ట్ర మద్యం ప్రత్యేక బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో విక్రయాలు జరపడం ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో గండిపడడమే కాకుండా అంతర్రాష్ట్ర మద్యం చట్ట విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి రావడం విగ్రహాలు జరుపుతున్న మద్యం ఎక్స్పైరీ డేట్ అయిపోయి చెడిపోయిన మద్యం కూడా ఉండవచ్చు అలాగే ఇతర కెమికల్ లాంటి పదార్థాలను వాడి బ్రాండ్ పీర్లను లేబుళ్లను అతికించి విక్రయాలు కూడా జరిపే అవకాశముంటుంది. ఇలా కెమికల్ తో పాటు ఎక్స్పరి డేట్ అయిన మద్యం తక్కువ ధరకు విక్రయాలు చేయడంతో ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు గండితోపాటు ప్రజల ప్రాణానికి కూడా నష్టం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉండగా అంతరాష్ట్ర మద్యం పెద్ద మొత్తంలో మండలంలోని అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయించడం ఇటు ఆప్కారి శాఖకు లైసెన్స్ మద్యం దుకాణాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఒకవైపు అయితే దర్జాగా ఉమ్మడి మండలంలో మధ్యప్రదేశ్ అంతర్రాష్ట్ర మద్యాన్ని పెద్ద మొత్తంలో ఒక మాఫియా తన అక్రమ మద్యం వ్యవహారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగించడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మండలం లొనే అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా ముఠా.!?

జిల్లావ్యాప్తంగా గత పది రోజుల నుండి పెద్ద మొత్తంలో ఆప్కారి శాఖ దాడుల్లో దొరికినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్ర మద్యం విక్రయాలకు సంబంధించి కొత్త పేరు తెరపైకి రావడం జరుగుతుంది. అదేమిటంటే గత కొన్ని రోజులుగా ఉమ్మడి మండలంలో అంతర్రాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మద్యం ఇంపీరియల్ బ్లూ తో పాటు ఇతర లేబుల్ లేనటువంటి బాటిళ్లు పెద్ద మొత్తంలో సరఫరా జరుగుతున్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతర్ రాష్ట్ర మద్యం ముఠాకు సంబంధించి మహదేవ్పూర్ మండలంలోని ఓ గ్రామం నుండి మద్యం ముఠా కార్యకలాపాలను కొనసాగించడం జరుగుతుందని విశ్వనీయ సమాచారం. దీనికి సంబంధించి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇతర జిల్లా వాసి బతుకుదెరువు నిమిత్తం మండలంలో నివసిస్తూ అంతర్ రాష్ట్ర మద్యం సరఫరా చేయడం జరుగుతుందని సమాచారం. ముఠా వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం మండలమంతా ముఠా వ్యవహారంతో పాటు మండలంలోని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అంతర్ రాష్ట్ర మద్యాన్ని పెద్ద మొత్తంలో బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి సరఫరా చేయించడం జరుగుతున్న విషయం తెలవడంతో మండల ప్రజలు ఆశ్చర్య పోవడం గమనార్ధం.

ఉమ్మడి మండలంలో అంతర్ రాష్ట్ర మద్యం పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.!?

స్థానికంగా ఒకప్పుడు బెల్ట్ షాపుల ద్వారా జోరుగా మద్యం విక్రయాలు అన్న విషయాలు వార్తలు సంచలనాన్ని లేపి విషయం తెలిసింది. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది లైసెన్స్ దుకాణాల బెల్ట్ షాపులు కనిపించకుండా పోయి ఉమ్మడి మండలమంతా మధ్యప్రదేశ్ మద్యం హవా నడుస్తుంది అనడానికి గల పది రోజుల క్రింద మద్యం పార్టీలను ఎక్సైజ్ అధికారులు స్వాధీన మర్చిపోవడం జరిగింది అనేదే సాక్ష్యం. అంతేకాకుండా ఉమ్మడి మండలంలో ప్రస్తుతం అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా మండలంలోని ఓ గ్రామం నుండి కొనసాగించడం జరుగుతుందని విశ్వనీయ సమాచారం కావడంతో మండలంలో పెద్ద మొత్తంలో అంతర్రాష్ట్ర మద్యం విక్రయాలు జరుగుతున్నాయనేది అంతర్గతంగా పలు వ్యవహారాలు తెరపైకి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కుదురపల్లి, మహాదేవపూర్ సూరారం అంబర్ పెళ్లి పరిమెల, పాటు పలు ఆమ్లెట్ గ్రామాల్లో అంతర్రాష్ట్ర మద్యం బెల్ట్ షాపులు జోరుగా నిర్వహించడం జరుగుతుందని సమాచారం.

పెద్ద మొత్తంలో అంతర్రాష్ట్ర మద్యం బెల్ట్ నిర్వాహకులకు గుర్తింపు.!?

ఇక మండలంలో సంచలనం రేపిన అంతర్రాష్ట్ర మద్యం విక్రయాలు పెద్ద మొత్తంలో బెల్ట్ షాపుల నిర్వహణ గత పది రోజుల నుండి మద్యం ముఠాపై వస్తున్న వార్తలు ఒకవైపు అయితే మరోవైపు ఉమ్మడి మండలంలో మధ్యప్రదేశ్ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతున్నాయని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ శాఖ పెద్ద మొత్తంలోనే మద్యం విగ్రహాలు జరుపుతున్న బెల్ట్ షాపులకు సంబంధించి దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఎక్సైజ్ దాడుల్లో అనేక బెల్టు షాపుల్లో అంతర్రాష్ట్ర మద్యం బాటిళ్లు అలాగే నాన్ స్టిక్కరింగ్ బాటిల్లు కూడా పెద్ద మొత్తంలో లభ్యమైనట్లు సమాచారం. ఇక బెల్టులకు సంబంధించి పెద్ద మొత్తంలో వివాహకులకు ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకు వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. గత పది రోజుల నుండి ఎక్సైజ్ కార్యాలయం అంతర్ రాష్ట్ర మద్యం విక్రయాలు జరుపుతున్న బెల్ట్ షాపుల నిర్వాహకులు అలాగే పెద్ద మొత్తంలో మధ్యప్రదేశ్ నుండి మహాదేవపూర్ వరకు మద్యాన్ని తీసుకువచ్చి విక్రయాలు జరుగుతున్న ముఠాలకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు పలువురిని గుర్తించినట్లు విశ్వనీయ సమాచారం.

మాఫియాను రక్షించే క్రమంలో రంగంలోకి రాజకీయ నాయకులు.?

అంతర్రాష్ట్ర మద్యం మాఫియా గుట్టురట్టయి క్రమంలో ఎక్సైజ్ శాఖ గత పది రోజుల నుండి బెల్ట్ షాపుల విక్రయాలు జరుపుతున్న వ్యక్తులకు అలాగే ఉమ్మడి మండలంలో అంతర్రాష్ట్ర మద్యాన్ని ముఠాగా ఏర్పడి సరఫరా చేస్తున్న మద్యం మాఫియా కు సంకెళ్లు వేసే ప్రయత్నంలో నిమగ్నం కావడం జరుగుతున్న క్రమంలో అంతరాష్ట్ర మద్యాన్ని విక్రయించే పలు బెల్ట్ నిర్వాహకులు అలాగే మాఫియాకు సంబంధించిన పలువురిని ఎక్సైజ్ శాఖ గుర్తించి కార్యాలయానికి తీసుకువెళ్లడం జరగడంతో ఇంకేముంది మద్యం మాఫియా కు కూడా రాజకీయ అండదండలు ఎగిసిప పడడం ప్రారంభమైంది. మాఫియా తో పాటు అంతరాష్ట్ర మద్యం విక్రయాలు జరుపుతున్న బెల్ట్ నిర్వాహకులకు రాయబారానికి రాజకీయం తోడైంది. గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ కార్యాలయం అంతర్ రాష్ట్ర మద్యం విక్రయదారులతో విచారణ చేస్తూ నిమగ్నమైన వేళ రాజకీయ నాయకులు దర్శనం ఇవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. అంతరాష్ట్ర మద్యం విక్రయ దారులకు అలాగే మధ్యప్రదేశ్ మద్యం ముఠా ను రక్షించుటకు పలు రాజకీయ నాయకులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరి అధికారులను పక్కదారి పట్టించే ప్రయత్నంలో నిమగ్నమైనట్టు విశ్వవిద్యా సమాచారం.

అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా పై ఎక్సైజ్ కమిషనర్ ఏలాంటి చర్యలు తీసుకుంటారు చూడాల్సిందే..!

మహదేవ్పూర్ మండలం తో పాటు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయాలు మండలంలో జోరుగా కొనసాగడం ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో దాడులు నిర్వహించి మధ్యప్రదేశ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే, దీనికి సంబంధించి ఉమ్మడి మండలంలో పెద్ద మొత్తంలో అంతరాష్ట్ర మధ్య విగ్రహాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఎక్సైజ్ శాఖ చేసిన దాడుల్లో అంతరాష్ట్ర మద్యం బాటిల్లు అలాగే నాన్ స్టిక్కరింగ్ బాటిల్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు కూడా తెలుస్తుంది, అంతేకాకుండా ఇప్పటికే అంతరాష్ట్ర మద్యం విక్రయదారులకు అలాగే బెల్ట్ షాపులకు వికయాలు జరుపుతున్న ముఠా పలువురు వ్యక్తులకు సైతం విచారణ చేస్తున్నట్లు విశ్వ నియో సమాచారం. ఇదే క్రమంలో బెల్ట్ షాపుల నిర్వాహకులకు అలాగే అంతరాష్ట్ర మద్యాన్ని రవాణా చేస్తున్న ముఠా పై చర్యలు తీసుకోకుండా పలువురు రాజకీయ నాయకులు పైరవీలను చేయడం జరుగుతుందని తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో స్థానికంగా ఉన్న మద్యం విక్రయాలకు పెద్ద మొత్తంలో ఆటంకం కలిగి ప్రభుత్వ ఖజానాకు గండి పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా అంతరాష్ట్ర మద్యం విక్రయాల వల్ల విచ్చలవిడిగా అంతరాష్ట్ర మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు కావడంతో మద్యం దుకాణాలకు పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగక లైసెన్స్ మద్యం దుకాణాలు మద్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్సైజ్ కమిషనర్ అంతర్ రాష్ట్ర మద్యం విక్రయాలు చేస్తున్న బెల్ట్ షాపులకు సంబంధించి అలాగే అంతర్రాష్ట్ర మద్యం మాఫియా లపై రాజకీయ ఒత్తిడికి గురికాకుండా తక్షణమే బెల్ట్ షాపుల నిర్వాహకులు అలాగే అంతర్రాష్ట్ర మద్యం ముఠాపై చర్యలు తీసుకొని అక్రమ మద్యం రవాణా ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *