భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
160 కిలోల గంజాయి విలువ 40,00,000/- గంజాయి రవాణా కి వినియోగించిన స్విఫ్ట్ కారు స్వాధీనం పోలీసుల ఆధీనంలో నలుగురు వ్యక్తులు
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి 160 కిలోల గంజాయి, షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు ఘనపురం (ము) ఎస్సై అశోక్ మరియు తన సిబ్బందితో కలిసి రవి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ములుగు వైపు నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు నెంబరు (AP 29 AC 6115) ఆపి ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 75 ప్యాకెట్లలో సుమారు 160 కిలోల గంజాయి కనిపించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది పేర్లు A1) తోట మాధవరావు, తండ్రి: తోట ఈశ్వరరావు,వయసు :55 సంవత్సరాలు, కులం: కాపు గ్రామం:ద్వారపూడి, మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ A2)బీమ్ ప్రసాద్ కారి తండ్రి:గులాబ్కారి వయసు: 45 సంవత్సరాలు కులం:ఎస్సీ హరిజన్ వాల్మీకి గ్రామం: చిత్రకొండ,ఒరిస్సా A3) సోమరుటాక్రి తండ్రి: అర్జున్ ఠాక్రి వయసు:50 సంవత్సరాలు, కులం ఎస్సీ హరిజన్ వాల్మీకి గ్రామం చిత్రకొండ ఒరిస్సా
A4) మక్కువ మోసిస్ తండ్రి శంకర్ రావు, వయసు 49 సంవత్సరాలు కులం కర్ణ పట్నాయక్ గ్రామం ద్వారకా నగర్ విశాఖపట్నం.
పై వారందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దారకొండ గ్రామం కు చెందిన బాబురావు వద్ద 160 కిలోల గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి భూపాలపల్లి పరిసర ప్రాంతాలలో అమ్ముటకు స్విఫ్ట్ కారులో తీసుకొని వస్తుండగా ఘనపురం మండలం రవి నగర్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడినారు పై నలుగురు వ్యక్తులని అరెస్టు చేసి స్విఫ్ట్ కారు 160 కిలోల గంజాయి స్వాధీన పరుచుకుని , కేసు నమోదు చేసి నిందితులని కోర్టు ఎదుట హాజరు పరచడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా మరియు సేవిస్తున్న వారి మీద పోలీసులు, పటిష్ట నిఘా పెట్టి పూర్తిస్థాయిలో గంజాయిని నియంత్రించుటకు, అలాగే జిల్లా ను గంజాయి రహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, గంజాయి నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి మరియు మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ సమాచారమయినా, జిల్లా యాంటీ నార్కోటిక్ టీం ఫోన్ నెంబర్ 8712658111 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన భూపాలపల్లి డీఎస్పి సంపత్ రావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చిట్యాల సీఐ మల్లేష్ సీసీస్ ఎస్ఐలు ఏం సాంబమూర్తి, జె. రమేష్, ఘనపురం ఎస్ఐ అశోక్ సిసిఎస్ సిబ్బంది గణపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించినారు.