నిజాంపేట, నేటి దాత్రి,ఏప్రిల్ 13:
మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ అవినీతి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు 2014 సంవత్సరంలో రైతు రుణమాఫీ విషయంలో అనేక ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు 56 మంది రైతులు తమకు అనుకూలంగా ఓటు వేయలేదని కక్షతో కొందరు నాయకులు రుణమాఫీ జరగకుండా వివక్షత చూపారని ఆవేదన చెందారు రుణమాఫీ విషయంలో ఉన్నంత స్థాయి అధికారులతో విచారణ జరిపించి అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు