వివిధ రంగాలలో రాణించిన రెడ్డికులస్థులకు సన్మానం.

# శ్రీ వేమన రెడ్డి సంక్షేమ పరపతి సంఘం అధ్వర్యంలో కార్యక్రమం.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా రెడ్డి కులంలో వివిధ రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న ఆరుగురు వ్యక్తులను నర్సంపేట డివిజన్ శ్రీ వేమన రెడ్డి సంక్షేమ పరపతి సంఘం అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నర్సంపేటలోని గ్రీన్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో శ్రీ వేమన రెడ్డి సంఘం అధ్యక్షుడు చింతల కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, దాసరి నరసింహారెడ్డి, పరపతి సంఘం అధ్యక్షులు ఈదునూరి రవీందర్ రెడ్డి, వీరమల్లు మాధవరెడ్డి, సంక్షేమ సంఘం కార్యదర్శి కేశిరెడ్డి రాజేంద్రప్రసాద్ రెడ్డి, బైరి తిరుపతిరెడ్డి, బీరం నాగిరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న నల్లబెల్లి మండల విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్, నర్సంపేట మండలంలో చద్రయ్యపల్లి గ్రామానికి చెందిన పెద్ది రవళి, నర్సంపేట కథలు పుస్తక రచయిత ,హన్మకొండ అసిస్టెంట్ ఏఈ మొగిలి అనిల్ రెడ్డి,ఇటీవలనే ఆర్మీ నుండి పదవి విరమణ పొందిన (పొగుళ్లపల్లి) చలమల్ల రాజిరెడ్డి, తెలుగు కవి,రెండు ప్రేమల వాన రచయిత కేతిడి యాకూబ్ రెడ్డి,ఇటీవల పీజీటీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా సెలెక్ట్ అయిన కేతిడి జీవన్ రెడ్డి,టీజీటీలో ఇంగ్లీష్ టీచరుగా సెలెక్ట్ అయిన బోనాల కృపాకర్ రెడ్డి లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వారిని సన్మాన గ్రహీతల ఉద్దేశిస్తూ ముఖ్య అతిధులు మాట్లాడుతూ వీరి ఫెయిల్యూర్ స్టోరీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందన్నారు. అలాగే రెడ్డి కులంలో పుట్టి ఆర్థిక స్థోమత లేకుండా ఇబ్బందుల పడుతున్న వారికి చేయూతనివ్వడానికి శ్రీ వేమారెడ్డి సంఘం ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు సుధాకర్ రెడ్డి,కుంభం కుమార్ రెడ్డి, గణపతి రెడ్డి, కొత్త రవీందర్ రెడ్డి మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *