మంచిర్యాల నేటిదాత్రి:
మంచిర్యాల పట్టణం లోని నారాయణ హై స్కూల్ లో చిన్నారులు నిర్వహించిన అకాడమీక్ ఫెయిర్ అలరించింది . బుధవారం మధ్యాహ్నం స్కూల్ లో చిన్నారులు వారి ప్రతిభ తో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రాజెక్ట్ లు, వారి వివరాలు పేరెంట్స్, టీచర్, ముఖ్య అతితులను అల్లరించింది. అనంతరం agm చైతన్య రావు, మంచిర్యాల మిన్సిపల్ వైస్ చైర్ పర్సన్ సల్ల మహేష్ లు మాట్లాడుతూ, చిన్నప్పాట్టి నుండే పిల్లలకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడం గొప్పవిషయమని తెలిపారు. చదువు తో పాటు క్రమశిక్షణ, పిల్లల అభివృద్ధి కి తోడపడుతుందన్నారు. చిన్నారులకు చదువు, సైన్స్ పట్ల అవగాహనా కల్పించడం నారాయణ స్కూల్ల కే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మడిశెట్టి కవిత, హై స్కూల్ డీన్ వెంకటస్వామి, ఏ ఓ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి, ఈ కిడ్స్ ఆర్ ఎన్ డీ సంగీత, కో ఆర్డనేటర్ రవళి ప్రియా, కుమార్, ఇమ్రాన్, టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.