పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చుల పై డేగ కన్ను పెట్టాలి

వనపర్తి నేటిదాత్రి :
పార్లమెంట్ అబ్యర్టులపై డేగ కన్ను పెట్టాలని
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు అధికారులను సౌరభ్ ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి లో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్, వ్యయ మదింపు అధికారి ఛాంబర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానటరింగ్ కమిటీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి పరిశీలించారు
సి. విజిల్ యాప్ ద్వారా వచ్చివ ఫిర్యాదులు, 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదులు వాటిని పరిష్కరించిన నివేదికలు పరిశీలించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎఫ్.ఎస్ టి, ఎస్.ఎస్.టి బృందాల పనితీరు, ఇప్పటి వరకు జప్తు చేసిన వివరాలు , వీడియో పరిశీలకుల నివేదికను పరిశీలించారు. అభ్యర్థులు, పార్టీ తరపున ప్రచార నిమిత్తం సభలు, సమావేశాలు, ర్యాలిలలో ఉపయోగించిన వస్తువులు వాటి ఖర్చు వివరాలను పరిశీలించారు . మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం, పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం వాటి ఖర్చు వివరాలను అడిగి తెలుసులుకున్నారు.అన్ని బృందాలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థులు ఆయా మార్గాల ద్వారా చేస్తున్న ప్రచార వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసుకొని ఖర్చులను పక్కగా వారి ఖాతాలో జమ చేయాలని సూచించారు.
జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఆయా అభ్యర్థులు, పార్టీలు, స్టార్ క్యాంపేనర్ల ద్వారా చేస్తున్న ప్రచారం పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగిందన్నారు. వారు వాడుతున్న వాహనాలు, ఇతర ప్రచార సామాగ్రి నీ వీడియో తీయించి ప్రచారానికి సంబంధించిన ప్రతి ఖర్చును ఎన్నికల వ్యయంగా నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సమీకృత కంట్రోల్ రూం ద్వారా ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి బృందాలను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నట్లు వ్యయ పరిశీలకులను విశదీకరించారు.
జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఎ. ఒ భాను ప్రకాష్ , సి. సెక్షన్ తహశీల్దార్ కిషన్ నాయక్, తదితరులు ఎన్నికల వ్యయ పరిశీలకుల వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!