
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి.జానకి, ఐపీస్ ఆదేశాల మేరకు , షీ టీమ్ మరియు భరోసా టీమ్ సభ్యులతో గురువారం 09.01.2025 న మహబూబ్నగర్ లోని క్రిస్టియన్ పల్లి,పంచవటి హైస్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎస్.పి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భగా డీఎస్స్పీ మాట్లాడుతూ షీ టీమ్ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది, అది వారికి ఎలా ఉపయోగపడుతుందని, విద్యార్థులకు తెలియజేశారు. ఈవ్ టీజింగ్ సోషల్ మీడియా వేధింపులను పెంచడం, మహిళల అక్రమ రవాణా, బాలల దుర్వినియోగం, బాల్య వివాహాలు, బాల కార్మికులు, చైల్డ్ లైన్ 1098, బోండెడ్ లేబర్ పోస్కో చట్టం పని వేధింపులు, మంచి టచ్ మరియు చెడు టచ్, యాంటీ-ర్యాగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, సైబర్ క్రైమ్ షీటీమ్ ఎల్లప్పుడూ సమస్యల్లో సహాయం చేస్తుందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే అత్యవసరంగా 100 డైల్ మరియు షీటీమ్ నంబర్ 8712659365 మరియు క్యూ ఆర్ కోడ్ ను ఇది షీటీమ్ & రోడ్డు భద్రతను చేరుకోవడానికి కొత్త మార్గం. చూపిస్తుందని భరోసా ఇచ్చారు..
భరోసా సెంటర్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక సేవా కేంద్రం, ఇది మహిళలు, పిల్లలు, మరియు కుటుంబ హింస బాధితుల కోసం మద్దతు మరియు న్యాయం పొందడానికి సహాయపడుతుంది. భరోసా సెంటర్ వివిధ విభాగాలతో పనిచేస్తూ, బాధితులకు ఒకే చోట అన్ని సేవలను అందించేందుకు ఉపయోగపడుతుంది.
బాధితుల సమస్యలకు న్యాయ పరమైన పరిష్కారం కోసం లీగల్ కౌన్సిలింగ్ అందిస్తారు.
డాక్టర్ల ద్వారా వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్స అందిస్తారు.
మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలింగ్ సేవలు అందిస్తారు.
బాధితులు ఫిర్యాదు చేసేందుకు, విచారణను వేగవంతం చేయేందుకు ప్రత్యేక పోలీసు విభాగం ఉంటుంది.
(భరోసా 8712659280)
అవసరమైన బాధితులకు తాత్కాలిక ఆశ్రయం అందిస్తారు.
మొత్తం 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, భరోసా ఇన్చార్జి డబ్ల్యూ ఎస్ ఐ సుజాత, షీ టీం సభ్యులు వనజ రెడ్డి, రఘు, మరియు స్కూల్ హెడ్మాస్టర్, పాల్గొనడం జరిగింది…