
Honest Auto Driver Returns Lost Money
గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆదివారం ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేశ్వర్ దసరా పండుగ సందర్భంగా సరుకులు కొనుగోలు చేయడానికి జహీరాబాద్‌కు వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో కొల్లూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్ ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న సంగమేశ్వర్ తన వద్ద ఉన్న సరుకులు చూసుకుంటే సుమారు రూ. 8 వేల రూపాయలు ఎక్కడో పోయాయని గుర్తించారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్ సోమవారం ఉదయం తన ఆటోను పరిశీలిస్తే రూ.8 వేల రూపాయలు లభించాయి. వెంటనే ఆయన ఆ డబ్బును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు ఆ డబ్బులు ఝరాసంగం గ్రామానికి చెందిన గుర్తించి, ఆయనకు తిరిగి అందజేశారు.
ఎస్సై క్రాంతి కుమార్, గ్రామస్తులు రాజ్‌కుమార్ ఘనంగా సన్మానించి అభినందించారు.