పరకాల నేటిధాత్రి
పరకాల మండల లక్ష్మీపురం గ్రామంలో గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు విస్తృతంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల మేనిఫెస్టో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. బీఆర్‌ఎస్ గెలుపుతోనే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని తెలిపారు.కారుగుర్తుకు ఓటేసి పరకాల అభివృద్ధి ప్రదాత చల్ల ధర్మరెడ్డిని గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ నాయకుల అసత్య ప్రచారాలు,కుటిల ప్రయత్నాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపడుతూ గ్రామస్తులను,మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో బి ర్ ఎస్ మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.