శాయంపేటనేటి ధాత్రి:
శాయంపేట మండలం రక్తదానం చేసిన పెద్దకోడేపాక ఏపీఆర్ సేన కింగ్ కోగిల బ్రదర్స్ ఏసిపి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబరంలో అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని భావించి శాయంపేట ఎస్సైదేవేందర్ పిలుపు మేరకు రక్తదానం చేసిన యువత. ఏసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని రక్తదాత రుణం తీర్చుకోలేనిదని విలువ కట్టలేనిదని అన్నారు ప్రమాద బాధితులకు, ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రక్తం ఇవ్వడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే మానవ జన్మకు సార్థకత ఉంటుందని తెలిపారు. అత్యవసర స్థితిలో ఉన్న రోగికి, రోడ్డు ప్రమాదంలో గాయపడి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్ సొసైటీ అధికంగా పాల్గొంటున్నారు. ఎవరు రక్తదానం చేయొచ్చు. 18 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు, వ్యక్తి సగటు 45 కిలోల బరువు ఉండి 12.5 గ్రాములు హిమోగ్లోబిన్ కంటే ఎక్కువ ఉన్న వారెవరైనా రక్తదానం చేయొచ్చునని వైద్య నిపుణులు వెల్లడించారు మలేరియా, క్యాన్సర్, క్షయ, మూర్చ, కరోనా పాజిటివ్ ఉన్నవారు రక్తదానం చేయకూడదు. పురుషులు మూడు నెలలకు ఒకసారి మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు.