మహాగౌరి యూత్ అసోసియేషన్ సభ్యులు
కాప్రా నేటిధాత్రి 04:
దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మహాగౌరి యూత్ అసోసియేషన్ సభ్యులు అమ్మవారిని వేడుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని నాగార్జున కాలనీ ఫస్ట్ లైన్ లో మహా గౌరీ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గా మాత అమ్మవారికి గురువారం రాత్రి మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి యూత్ అసోసియేషన్ సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ వారు మాట్లాడుతూ ప్రజలందరికీ అరిష్టాలు తొలగిపోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరారు. ఈ సంవత్సరం మహాగౌరీ అసోసియేషన్ సభ్యులు అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగిందని, తొమ్మిది రోజులపాటు అమ్మవారు పది రూపాయలలో అవతరించే అలంకరణలు చేసి, ప్రత్యేకమైన నిష్ఠలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాగౌరి యూత్ అసోసియేషన్ సభ్యులు ఎస్ రేవంత్ రెడ్డి, సిహెచ్ మాదేష్, ఎం జస్వంత్, జి విక్రమ్, ఎం కార్తీక్, ఎస్ సాయికిరణ్, వి అంజన్, వి సాయి, కె సాయి, టి ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, కె సంతోష్, ఎస్ మల్లారెడ్డి, ఎస్ నరసింహారెడ్డి, బి శ్రీనివాస్, కె రామ్మూర్తి చారి, ఎం బాబు నాగ శ్రీనివాస్, డి శశి వత్సల్, రాందాస్, స్థానిక కాలనీ వాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.