అమ్మ మాట – అంగన్వాడి బాట

చేర్యాల నేటిధాత్రి…

స్థానిక చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల 3,6, 11 అంగన్వాడి కేంద్రాలు కలిపి అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, ఐసిడిఎస్ చేర్యాల సూపర్వైజర్ నాగమణి హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం విజయలక్ష్మి పాల్గొనడం అయినది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చి ఐదేళ్లు నిండే వరకు అంగన్వాడీలోనే ఉంచడం వల్ల వారికి క్రమశిక్షణతో పాటు ఆటపాటల విద్య అలబడుతుందని నర్సరీ, ఎల్కేజీ , యూకేజీ. అంగన్వాడి కేంద్రాలలోనే కంప్లీట్ అవుతుందని తల్లులకు వివరించడం జరిగింది.. సూపర్వైజర్ నాగమణి మాట్లాడుతూ గర్భిణీ బాలింతలను అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వేడివేడి భోజనం చేయడం వల్ల, కడుపులోని ఉన్న బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని వివరించారు.. హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం పిల్లలు,గర్భిణీ,బాలింతల శుభ్రత గురించి చెప్పడమైనది.. అలాగే అంగన్వాడి టీచర్లు వీధిలో ర్యాలీ తీస్తూ రెండున్నర సంవత్సరాల పిల్లలను గుర్తించి వాళ్ళ ఇళ్లను సందర్శించి పిల్లలను నమోదు చేసుకోవడం జరిగింది.. అంగన్వాడీ టీచర్లు శోభ, కృష్ణవేణి, రేణుక హెల్పర్ బాల్ లక్ష్మి, ఆశా వర్కర్లు నాగమణి రమ ,గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *